మీ దేవుని మందిరం ఎలా ఉండాలి? ఏ లోహ విగ్రహాలు ఉంచాలి?

ఈ శాన్యంలోనే దేవుడి గది ఉండాలి. బాత్ రూంల వద్ద దేవుడి గది
ఉండకూడదు,  ఇటువంటి నియమాలను మనం ఘనంగా
పరిగణలోకి తీసుకుంటాం... కానీ మనకున్న రోజువారి పనులలో పడి దేవుడి గదిని
పరిశుభ్రంగా ఉంచడం మాత్రం మర్చిపోతుంటాం. అయతే మనం నిత్యం ఆరాధించే దేవుని
మందిరాన్ని శుభ్రంగా ఉంచే విషయంలో కూడా మనం కొన్ని నియమాలు పాటించాలంటారు
పెద్దలు... అవేంటో చూద్దాం...


దేవుడి గదిని కనీసం వారానికి ఒక్కసారైనా పూర్తిగా శభ్రం
చేయాలి. ఇలా చేయక పోవడం వల్ల దేవుని మందిరంలో మనం నిత్యం పూజచేయడానికి వినియోగించే
పదార్థాలు కుళ్లిపోయి మూలమూలల్లో ఉండిపోతాయి. దీనివల్ల క్రిమి కీటకాలు చేరి
అనారోగ్య పరిస్థితులకు దారి తీస్తుంది. బొద్దింకలు, బల్లులు, ఎలుకలు చేరడం వల్ల
దేవుడి విగ్రహాలు, పటాలు పాడై పోతాయి. మీకు ప్రతీ వారం వీలుకుదరక పోతే కనీసం
నెలకొక సారైనా పూర్తిగా శుభ్రంచేసే పని పెట్టుకోండి.

అంతే కాదు అది ఆధ్యాత్మిక దృష్టితో చూసినా శుభం కాదు. దేవుని
మందిరం మన మనసుల కన్నా శుభ్రంగా ఉంటేనే మన పూజలకు తగిన ఫలం ఉంటుంది. దేవుని గది
అంతా అపరిశుభ్రంగా ఉంచుకుని దేవుడికి పూజలు మాత్రం ఘనంగా చేస్తుంటే ఏం లాభం
చెప్పండి....

ముఖ్యంగా పండుగల సందర్భంలో దేవుడిగదిని శుభ్రం చేయడంలో భాగంగా దేవుళ్ల
విగ్రహాలను, సింహాసనాన్ని, ఇంకా మందిరంలో వాడే ఇతర లోహపు వస్తువులను పూర్తిగా
కడిగి దేవుని మండపాన్ని శుచిగా ఉంచాలి. ఫీతాంబరి పౌడరు వంటివి మార్కెట్లోని కిరాణా
దుకాణాల్లో మనకు లభిస్తాయి. లేదంటే ఇంట్లో చింతపండు ఉండనే ఉంటుంది కదా దానితో విగ్రహాలు
తోమితే మరీమంచిది. 
వారం వారం దేవుడి మందిరంలోని మాలిన్యాన్ని పూర్తిగా
తొలగించడంతో పాటుగా కనీసం  ఏడాదికి
ఒక్కసారైనా దేవుడి మందిరం ఆసాంతం ఖాళీ చేసుకుని సున్నం లేదా రంగులు వేసుకోవాలి.
దీనివల్ల దేవుని మందిరంలో రోగకారక క్రిములు కూడా చేరకుండా
ఉంటాయి. ఎందుకంటే దేవునికి నివేదించే చాలా పదార్ధాలను మనం పూజా ద్రవ్యాలను మనం
మందిరంలోనే ఉంచుతాం కదా... 
దేవుని మందిరాన్ని
శుభ్రం చేసే ముందు లేదా వాటిని పూర్తిగా తొమేముందు మీరు శుభ్రంగా స్నానం చేసి
దేవుని పూజకు ఏవిధంగా సిద్ద పడతారో అలాగే సిద్ధం కండి. దైవారాధతో సమానమే ఈ
పనికూడా...
 ఇక దేవుని మందిరంలో ఉండే సామాగ్రి ఎలాంటివి ఉండాలనే వాటి
విషయంలో కూడా కొన్ని నిబంధనలు పెట్టారు  మన
పెద్దలు. 
దేవుని మందిరంలో స్టీలు విగ్రహాలు, పళ్లాలు, హారతి, దీపపు
కుందెలు ఉండడం మంచిది కాదు. రాగి విగ్రహాలు శ్రేష్టం, లేదంటే ఇత్తడి విగ్రహాలు,
పళ్లాలు, కుందెలు కూడా వాడవచ్చు. మీకు స్థోమత ఉంటే వెండివి వినియోగిస్తే మరీ
మంచిది.