శ్రీవారు జన్మించిన శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మంగళవారం సాయంత్రం ”అన్నమయ్య శృంగార వైభవం”, ”అన్నమయ్య మధుర శృంగారం” సిడిలను టిటిడి ఎస్.వి.రికార్డింగ్ ప్రాజెక్టుప్రత్యేకాధికారి శ్రీ మునిరత్నం రెడ్డి అవిష్కరించారు.
టిటిడి ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ”అన్నమయ్య శృంగార వైభవం” సిడిలోని సంకీర్తనలను ఎస్వీ సంగీత, నృత్య కళాశాల అధ్యాపకురాలు డా|| కె.వందన స్వరపరిచి గానం చేశారు. ”అన్నమయ్య మధుర శృంగారం” సిడిలోని కీర్తనలను శ్రీమతి చల్లా ప్రభావతి స్వరపరచగా శ్రీమతి. బి.చిన్నమదేవి, శ్రీ కె.కల్యాణరావు ఆలపించారు. ఈ సందర్భంగా వీరిని దుశ్శాలువ, శ్రీవారి ప్రసాదంతో సన్మానించారు.
అనంతరం శ్రీ మునిరత్నంరెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు 2,622 అన్నమయ్య సంకీర్తనలను రికార్డు చేసి భక్తులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ సంకీర్తనలను టిటిడి వెబ్‌సైట్‌లో అందుబాటులో వుంచి భక్తులు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం టిటిడి కల్పించిందని వివరించారు. అనంతరం సిడిల్లోని కీర్తనలను గానం చేశారు.
ఈ కార్యక్రమంలో తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆచార్య కె.జె.క ష్ణమూర్తి ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Source