పూర్ణాహుతితో ముగిసిన శ్రీ గోవిందరాజస్వామివారి పవిత్రోత్సవాలు

 

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు శుక్రవారం పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి.

ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఉదయం  11.00 గం.ల నుండి 12.30 గం.ల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, పలురకాల పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు.

తదుపరి సాయంత్రం 5.30 గం.ల నుండి 6.30 గం.ల వరకు ఉత్సవ మూర్తులకు తిరువీధి ఉత్సవం, అనంతరం రాత్రి 07.30 గం.ల నుండి 09.30 గం.ల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, ప్రబంధ శాత్తుమొర, వేద శాత్తుమొర చేపడతారు. రాత్రి 9.30 నుండి 10.30 గం.ల వరకు ఉత్సవ మూర్తులు, కుంభం విమాన ప్రదక్షిణంగా సన్నిధికి  వేంచేపు చేసారు. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ పెద్ద జీయంగార్, శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయంగార్ పాల్గొన్నారు.