సింహాచలం చందనోత్సవం ఎలా జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది?

 

సింహాచలం ఆలయంలో వరాహ లక్ష్మీనరసింహ స్వామికి నిర్వహించే ఒక ప్రత్యేకమైన ఉత్సవం. స్వామివారి విగ్రహానికి గంధం పూయడం, అభిషేకం జరుగుతుంది. శ్రీ వరాహ నారసింహ స్వామి “ప్రహ్లాద వరదుడు కేవలం ప్రహ్లాదునీ రక్షించి “ప్రహ్లాదుని కోరిక మేరకు లక్ష్మి వరాహనృసింహ స్వరూపుడుగా నిలచిన భక్తి సులభుడు. విశాఖపట్నంలో గల శ్రీ సింహగిరి అనే సింహాచల క్షేత్రంలో వెలసి వున్నాడు శ్రీ లక్ష్మి వరాహ నారసింహుడు. వైశాఖ శుక్ల తదియను అక్షయ తృతీయ అంటారు. ఆ పుణ్యదినాన స్వామికి సంవత్సర కాలంగా వున్న చందనపు పూతనంతటిని జాగ్రత్తగా వేరుచేసి, యధావిదిగా అర్చనాదులన్నింటిని జరిపి కొన్ని గంటలు మాత్రమే నిజ రూప దర్శనం భక్తులకు కల్పించడం  ప్రత్యేకత. ఎక్కడెక్కడి నుంచో ఎంతో దూరాలనుంచి భక్తులు వస్తుంటారు. చందనం మొక్కుకొని కోర్కెలు తీర్చుకున్న భక్తులు రావడం, చందనం సమర్పించడం, స్వామి శరీరం నుండీ తీసిన గంధాన్ని ప్రసాదంగా స్వీకరించడం ఆనాటి ప్రత్యేకత. విష్ణుమూర్తి అవతారాల్లోని ఒకటైన నరసింహమూర్తికి అనేక ఆలయాలు ఉన్నాయి. కానీ దేశంలో మరెక్కడా లేనివిధంగా సింహాచలంలో కొలువుదీరిన అప్పన్న స్వామికి ఏటా చందనోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. దీనికి కారణం లేకపోలేదు, ప్రహ్లాదుడి కోరిక మేరకు హిరణ్యాక్షుడిని వధించిన వరాహావతారం, హిరణ్యకశిపుడిని సంహరించిన నరసింహావతారం రెండూ ఉగ్రరూపాలే. ఈ రెండు అవతారాల సమ్మిళితమై ఏక విగ్రహంగా ఏర్పడిన స్వామిని శాంతింపజేయడానికే ఆయన్ను చందన లేపనంతో సేవిస్తారని పురాణాలు పేర్కొంటున్నాయి. అంతేకాదు పురూరవ చక్రవర్తి నరసింహ స్వామిని మొదటిసారిగా దర్శించింది అక్షయ తృతీయనాడే. అందుకే ఆనాటి నుంచీ ప్రతి అక్షయతృతీయ నాడూ స్వామి మీద ఉన్న చందనాన్ని తొలగించి నిజరూప దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారని స్థలపురాణం తెలియజేస్తోంది.

చందనోత్సవం ఎలా చేస్తారు?

1. చందనోత్తరణం:

చందనోత్సవం ప్రారంభానికి ముందు, వైశాఖ శుద్ధ విదియ నాడు స్వామివారి విగ్రహం మీద ఉన్న చందనాన్ని తొలగిస్తారు. దీనినే చందనోత్తరణం అంటారు.

2. చందన సమర్పణ:

వైశాఖ శుద్ధ తదియ నాడు స్వామివారికి గంధం పూసే కార్యక్రమం జరుగుతుంది.

3. నిజరూప దర్శనం:

ఈ రోజు స్వామివారి అసలు రూపం దర్శనమిస్తారు. భక్తులు ఈ అరుదునైన అవకాశం కోసం ఎదురుచూడతారు.

4. సహస్ర ఘటాభిషేకం:

సింహాచలం గంగ ధార నుండి వేయి కలశలతో తీసుకొచ్చి సహస్ర ఘటాభిషేకం చేస్తారు.

5. బ్రహ్మోత్సవాలు:

చందనోత్సవం రోజు బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తారు.

6. ప్రసాదంగా చందనం:

స్వామివారి నుంచి తీసిన చందనాన్ని అక్షయ తృతీయ సందర్భంగా భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. చందన ప్రసాదం – ఫలితాలు

చందనయాత్ర పూర్తయిన మరుసటి రోజు నుంచే గంధాన్ని ప్రసాదంగా పంపిణీ చేస్తారు. ఏడాది పొడవునా స్వామి విగ్రహం మీద ఉన్న చందనాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ చందనాన్ని నీటిలో కలుపుకొని సేవిస్తే వ్యాధులు నయమవుతాన్నది భక్తుల విశ్వాసం. అందుకే ఈ ప్రసాదాన్ని పొందడానికి భక్తులు కిలోమీటర్ల మేర బారులు తీరుతారు.

7. పూజా కార్యక్రమాలు:

చందనోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు మరియు ఇతర మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

సుగంధ ద్రవ్యాలను కలిపి రంగ తీసిన చందనాన్ని చందనోత్సవం కోసం సిద్ధం చేస్తారు. అక్షయ తృతీయ ముందు రోజు రాత్రి.. స్వామివారి పై పూసిన చందనాన్ని తొలిచే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత స్వామి వారి నిజరూప దర్శనాన్ని భక్తులకు దర్శనం కల్పిస్తారు.