శ్రీ కోదండరామాలయంలో మే నెలలో జరిగే విశేష ఉత్సవాలు

 

తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మే నెలలో విశేష ఉత్సవాలు జరుగనున్నాయి.

  • మే 3, 10, 17, 24, 31వ తేదీల్లో శనివారం సంద‌ర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం నిర్వ‌హిస్తారు. సాయంత్రం 5 గంట‌లకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు. అనంత‌రం ఆలయంలో ఊంజల్‌సేవ జ‌రుగ‌నుంది.
  • మే 2న ఆల‌యంలో పుష్ప‌యాగానికి అంకురార్ప‌ణ‌.
  • మే 3న శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలో సాయంత్రం 4 నుండి 6 గంట‌ల వ‌ర‌కు పుష్ప‌యాగం.
  • మే 12వ తేదీ పౌర్ణమి నాడు ఆలయంలో ఉద‌యం 8.30 గంట‌ల‌కు అష్టోత్తర శతకలశాభిషేకం జరుగనుంది. ఈ సందర్భంగా సాయంత్రం 5.30 గంట‌ల‌కు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల ఊరేగి ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు.
  • మే 18న అన్న‌మాచార్య క‌ళామందిరంలో ఉద‌యం 8 గంట‌లకు శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆస్థానం.
  • మే 22న హ‌నుమ‌జ‌యంతి సంద‌ర్భంగా రాత్రి 7 గంట‌ల‌కు హ‌నుమంత వాహ‌నం.
  • మే 27న అమావాస్య సందర్భంగా ఉదయం 8 గంటలకు సహస్ర కలశాభిషేకం చేపడతారు. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనసేవ జరుగనుంది.
  • మే 30వ తేదీ పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు.