శ్రీవారి దర్శన టోకెన్లు, టికెట్లు కలిగిన భక్తులు నిర్దేశిత సమయంలోనే దర్శన క్యూలైన్లలోకి ప్రవేశించాలని టీటీడీ కోరుతోంది.
వేసవి సెలవులు,వారంతపు సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ కారణంగా సర్వ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లు కలిగిన భక్తులు ప్రణాళికాబద్ధంగా సమన్వయంతో దర్శనాలు చేసుకోవాలని తెలిపింది.