న్యూఢిల్లీలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో మే 11 నుంచి 19వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. మే 10న సాయంత్రం అంకురార్పణం జరుగనుంది.
బ్రహ్మోత్సవాల ముందు మే 6వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (ఆలయ శుద్ధి) నిర్వహిస్తారు. మే 11వ తేదీ ఉదయం 6 నుండి 8.07 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు.
బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు వాహన సేవలు జరుగనున్నాయి. మే 20వ తేదీన సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు
- 11-05-2025 ఉదయం – ధ్వజారోహణం, రాత్రి – పెద్దశేష వాహనం.
- 12-05-2025 ఉదయం – చిన్నశేష వాహనం, రాత్రి – హంస వాహనం.
- 13-05-2025 ఉదయం – సింహ వాహనం, రాత్రి – ముత్యపు పందిరి వాహనం.
- 14-05-2025 ఉదయం – కల్పవృక్ష వాహనం, రాత్రి – సర్వభూపాల వాహనం.
- 15-05-2025 ఉదయం – మోహినీ అవతారం, సాయంత్రం – కల్యాణోత్సవం, రాత్రి – గరుడ వాహనం.
- 16-05-2025 ఉదయం – హనుమంత వాహనం, రాత్రి – గజవాహనం.
- 17-05-2025 ఉదయం – సూర్యప్రభ వాహనం, రాత్రి – చంద్రప్రభ వాహనం.
- 18-05-2025 ఉదయం – రథోత్సవం, రాత్రి – అశ్వ వాహనం.
- 19-05-2025 ఉదయం – చక్రస్నానం, రాత్రి – ధ్వజావరోహణం.