వేద విద్య దినదినాభివృద్ధి చెందాలి – అహోబిల మఠాధిపతి శ్రీశ్రీ‌శ్రీ‌ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామీజీ

 

వేద విద్య దినదినాభివృద్ధి చెందాలని అహోబిల మఠాధిపతి శ్రీశ్రీ‌శ్రీ‌ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామీజీ అన్నారు. తిరుమలలో ఉన్న ధర్మగిరి వేద విజ్ఞాన పీఠాన్ని ఆయన ఆదివారం ఉదయం సందర్శించి విద్యార్థులకు అనుగ్రహ భాషణం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ వేద విద్యాభివృద్ధికి టీటీడీ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. తాను కూడా వేద విజ్ఞాన పీఠం పూర్వ విద్యార్థినే అని గుర్తు చేసుకున్నారు. వేద విద్యా విధానం అమలుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులతో కలిసి 17 వేదాలను ఆయన పఠించారు.

ఈ కార్యక్రమంలో వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని, టీటీడీ ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు, వేద, ఆగమ పండితులు పాల్గొన్నారు.