మార్చి 27 నుండి శ్రీ కోదండ‌ రామ‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు

 

తిరుప‌తి శ్రీ కోదండ‌రామ‌స్వామివారి వార్షిక‌ బ్ర‌హ్మోత్స‌వాలు మార్చి 27 నుండి ఏప్రిల్ 4వ తేదీ వ‌ర‌కు వైభవంగా జ‌రుగ‌నున్నాయి.

ఇందులో భాగంగా ఆల‌యంలో మార్చి 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం, మార్చి 26న బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌ నిర్వహిస్తారు.

వాహన సేవలు ప్రతిరోజు ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుండి 8:30 గంటల వరకు నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు 

  • 27-03-2025 : ఉదయం – ధ్వజారోహణం (ఉద‌యం 9.15 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు) , రాత్రి – పెద్దశేష వాహనం
  • 28-03-2025: ఉదయం – చిన్నశేష వాహనం, రాత్రి – హంస వాహనం
  • 29-03-2025: ఉదయం – సింహ వాహనం, రాత్రి – ముత్యపుపందిరి వాహనం.
  • 30-03-2025: ఉదయం – కల్పవృక్ష వాహనం, రాత్రి – సర్వభూపాల వాహనం
  • 31-03-2025: ఉదయం – పల్లకీ ఉత్సవం, రాత్రి – గరుడ వాహనం
  • 01-04-2025: ఉదయం – హనుమంత వాహనం,  రాత్రి – గజ వాహనం
  • 02-04-2025: ఉదయం – సూర్యప్రభ వాహనం, రాత్రి – చంద్రప్రభ వాహనం
  • 03-04-2025: ఉదయం – రథోత్సవం, రాత్రి – అశ్వవాహనం
  • 04-04-2025: ఉదయం – చక్రస్నానం, రాత్రి – ధ్వజావరోహణం