దసరా: దసరా నవరాత్రుల్లో ఏయే అవతారాల్లో అమ్మవారు దర్శనమిస్తారు?

సెప్టెంబరు 22, 2025వ తేదీ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమితో నవరాత్రులు మొదలై  అక్టోబరు 1వ  తేదీ ఆశ్వయుజ శుద్ధ దశమితో ముగుస్తాయి.

దసరా నవరాత్రుల వివరాలిలా...

సెప్టెంబరు 22, ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి : ఈ రోజు నుంచి దేవి నవరాత్రులు మొదలవుతాయి. బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో దేవీ నవరాత్రులు మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులను అలరిస్తారు. 

సెప్టెంబరు 23, ఆశ్వయుజ శుద్ధ విదియ : బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో దేవీ నవరాత్రులలో భాగంగా అమ్మవారు శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. 

సెప్టెంబరు 24, ఆశ్వయుజ శుద్ధ తదియ : బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో దేవీ నవ రాత్రులలో భాగంగా అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. 

సెప్టెంబరు 25,ఆశ్వయుజ శుద్ధ చవితి : బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో దేవీ నవ రాత్రులలో భాగంగా అమ్మవారు శ్రీలలితా త్రిపురసుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. 

సెప్టెంబరు 26, ఆశ్వయుజ శుద్ధ పంచమి : బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో దేవీ నవ రాత్రులలో భాగంగా అమ్మవారు శ్రీ మహా చండీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. 

సెప్టెంబరు 27,ఆశ్వయుజ శుద్ధ పంచమి, షష్టి: బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో దేవీ నవ రాత్రులలో భాగంగా అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. 

సెప్టెంబరు 28, ఆశ్వయుజ శుద్ధ షష్టి, సప్తమి మూలా నక్షత్రం : బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో దేవీ నవ రాత్రులలో భాగంగా అమ్మవారు శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. 

సెప్టెంబరు 29, ఆశ్వయుజ శుద్ధ సప్తమి, అష్టమి : దుర్గాష్టమి పర్వదినం. బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో దేవీ నవ రాత్రులలో భాగంగా అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. 

సెప్టెంబరు 30,ఆశ్వయుజ శుద్ధ అష్టమి, నవమి : మహర్నవమి పర్వదినం. బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో దేవీ నవ రాత్రులలో భాగంగా అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. 

అక్టోబర్ 01 ఆశ్వయుజ శుద్ధ ఆశ్వయుజ శుద్ధ దశమి : విజయదశమి పర్వదినం. బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో దేవీ నవ రాత్రులలో భాగంగా అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. అదే రోజు సాయంత్రం కృష్ణా నదిలో తెప్పోత్సవం జరుగుతుంది.