అక్టోబరులో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అక్టోబరులో జరుగనున్న ఉత్సవాల వివరాలిలా ఉన్నాయి.

  • అక్టోబరు 5, 12, 19, 26వ తేదీల్లో శుక్రవారం శ్రీ ఆండాళ్‌ అమ్మవారు సాయంత్రం 4.30 నుండి 5.30 గంటల వరకు ఊంజల్‌ సేవ అనంతరం ఆలయ మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు.

  • అక్టోబరు 8న ఉత్తర నక్షత్రం సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారు సాయంత్రం 4.30 నుండి 5.30 గంటల వరకు ఊంజల్‌ సేవ అనంతరం ఆలయ మాడ వీధుల్లో భక్తులను కటాక్షిస్తారు.

  • అక్టోబరు 18న విజయదశమి పార్వేట సందర్భంగా మధ్యాహ్నం 3 గంటలకు అశ్వ వాహనంపై శ్రీగోవిందరాజస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.

  • అదేరోజు, వేదాంతదేశికర్‌ శాత్తుమొర సందర్భంగా శ్రీవేదాంతదేశికర్‌తో కలిసి శ్రీగోవిందరాజ స్వామివారు రాత్రి 8 గంటలకు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు.

  • అక్టోబరు 20న ఆళ్వార్‌ సన్నిధిలో శ్రీ పేయాళ్వార్‌ వర్ష తిరునక్షత్రం జరుగనుంది.

  • అక్టోబరు 24న పౌర్ణమి గరుడసేవ నిర్వహిస్తారు.

  • అక్టోబరు 28న రోహిణి నక్షత్రం సందర్భంగా రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధిస్వామివారు సాయంత్రం 4.30 నుండి 5.30 గంటల వరకు ఊంజల్‌ సేవ అనంతరం ఆలయ మాడ వీధుల్లో భక్తులకు అభయమిస్తారు.


Source