అప్పలాయగుంట: జూలై 28న ప్రసన్నవెంకటేశ్వరుని వార్షిక పుష్పయాగం

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 28న వార్షిక పుష్పయాగం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు టీటీడీ పోస్టర్ శనివారం విడుదల చేసింది.

పుష్పయాగంలో భాగంగా రుత్విక్ వరుణం, మేదినిపూజ, అంకురార్పణ కార్యక్రమాలను జూలై 10వ తేదీన నిర్వహించారు. స్నపనతిరుమంజనం కార్యక్రమాన్ని 28వ తేదీ ఉదయం నిర్వహిస్తారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆరుగంటల వరకూ పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ వేడుకలకోసం అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఏర్పాట్లు పూర్తిచేశారు.

ఇటీవల జూన్ 23 నుంచి జూలై 1వతేదీ వరకూ అప్పలాయగుంటలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించిన విషయం తెలిసిందే.