ఫిబ్రవరి 23 నుంచి మార్చి 4వ తేదీ వరకు తరిగొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు

టిటిడికి అనుబంధంగా ఉన్న తరిగొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 4వ తేదీ వరకు జరుగనున్నాయి. ఫిబ్రవరి 22వ తేదీ సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగనుంది.

బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఫిబ్రవరి 18వ తేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు, తిరిగి రాత్రి 8 నుండి 10 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు తదితర ఆధ్యాత్మిక, సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి 28వ తేదీన కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు రూ.300/- చెల్లించి పాల్గొనవచ్చు. ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ ప్రసాదం బహుమానంగా అందిస్తారు. మార్చి 4వ తేదీన పుష్పయాగం జరుగనుంది.

lakshmi narasimha swamy

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు


తేదీ                             ఉదయం                                రాత్రి

  • 23-02-18(శుక్రవారం) ధ్వజారోహణం(మీనలగ్నం) హంస వాహనం

  • 24-02-18(శనివారం) ముత్యపుపందిరి వాహనం హనుమంత వాహనం

  • 25-02-18(ఆదివారం) కల్పవృక్ష వాహనం సింహ వాహనం

  • 26-02-18(సోమవారం) తిరుచ్చి ఉత్సవం పెద్దశేష వాహనం
    27-02-18(మంగళవారం) తిరుచ్చి ఉత్సవం గజ వాహనం

  • 28-02-18(బుధవారం) తిరుచ్చి ఉత్సవం సర్వభూపాలవాహనం, కల్యాణోత్సవం, గరుడ వాహనం.

  • 01-03-18(గురువారం) రథోత్సవం ధూళి ఉత్సవం

  • 02-03-18(శుక్రవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం, పార్వేట ఉత్సవం, అశ్వ వాహనం.

  • 03-03-18(శనివారం) చక్రస్నానం ధ్వజావరోహణం.


Source