షట్‌తిల ఏకాదశినాడు ఏం చేయాలి?

షట్‌తిల ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ రోజు తిలలతొ (నువ్వులు) ఆరు విశిష్ఠ కార్యక్రమాలు నిర్వహించడం శ్రేయస్కరమని శాస్త్రాల్లో పేర్కొన్నట్లు గురువరేణ్యులు ప్రవచిస్తున్నారు.

పితృదేవతలకు ఆ రోజు అత్యంత ప్రీతికరం. ఆ రోజున వారికి అర్పణాలు వదలడం ఆచారంగా వస్తున్నది. ఆరు కార్యాలు ఏమిటంటే..



  • నువ్వులతో స్నానం(తిలాస్నానం),

  • స్నానానంతరం నువ్వులముద్ద చేసి ఆ చూర్ణాన్ని శరీరానికి పట్టించడం

  • ఇంటిలో తిల హోమం నిర్వహించడం

  • పితృ దేవతలకు తిల ఉదకం సమర్పించడం

  • నువ్వులు కాని, నువ్వుల నూనె కాని ఒక బ్రాహ్మణునికి దానం ఇవ్వడం

  • చివరగా తిలాన్నం భుజించడం.(బియ్యం వుడికే సమయంలో నువ్వులు వేస్తే అది తిలాన్నం)


ఆ రోజున తిలలతో నిర్వహించే ఈ ఆరు పనులు పూర్తి చేసినవారికి పితృ దేవతలు, శ్రీ మహా విష్ణువు సంతసించి దీవెనలు అందజేస్తారు. ఆ కార్యక్రమాలు శ్రీ మహావిష్ణువును ఎంతో తృప్తిపరుస్తాయట. తిలా ఏకాదశిని యధావిధిగా పాటిస్తే ఆ పరంధాముడు సంతసించి దైహిక సంబంధమైన సర్వసుఖాలు సహా ఆ తరువాత ఊర్ధ్వ, అధో లోకాల్లో కూడ ఉత్కృష్ఠ స్థానం అనుగ్రహిస్తూ దీవిస్తాడని విశ్వాశం.

ఆచార వ్యవహారాలు, సాంప్రదాయం, భగవంతుడు అంశాలపై సంపూర్ణ విశ్వాసం ఉన్న వారు మరి ఉద్యుక్తులై భగవదాశీస్సులు పొందండి.
(హోమము, దానము కార్యక్రమాలు పురోహితుని పర్యవేక్షణలో జరుప వలసి ఉంటుంది)