జనవరి 24న నగరిలోని శ్రీ కరియ మాణిక్యస్వామివారి కల్యాణోత్సవం

టిటిడి అనుబంధంగా ఉన్న నగరిలోని శ్రీకరియమాణిక్యస్వామివారి ఆలయంలో జనవరి 24వ తేదీన రథసప్తమి పర్వదినాన స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 6.00 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి విశ్వరూప దర్శనం కల్పించనున్నారు. ఉదయం 9.00 నుండి 10.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కరియ మాణిక్యస్వామివారి మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 10.00 నుండి 11.00 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.

సాయంత్రం 5.30 నుండి రాత్రి 7.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకరియ మాణిక్యస్వామి కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది. రూ.500 చెల్లించి గృహస్తులు(ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. కల్యాణోత్సవంలో పాల్గొన్న గృహస్తులకు ఉత్తరీయం, రవికె, లడ్డూ, అప్పం బహుమానంగా అందజేస్తారు.

Source