సంక్రాంతి సంబరాల్లో భాగమైన గొబ్బిళ్ళ పండుగలో పాడుకును గొబ్బిళ్ల పాటలు మీ కోసం భక్తిసారం అందిస్తోంది.
సంక్రాంతి సంబరం అంతా గొబ్బిళ్ల వేడుకలలోనే కనిపిస్తుంది. ఇంటిముందు రంగవల్లుల్లాంటి కొత్త బట్టలు ధరించిన ఆడపిల్లు సప్తవర్ణాలు అద్దిన రంగవల్లుల మధ్యలో గొబ్బెమ్మలు ఉంచి వాటిని పూజించి అనంతరం గొబ్బిళ్ళ పాటలు పాడుతుంటే ఆ అందం ఆనందం మరొక సందర్భంలో రాదంటారు పెద్దలు. కానీ మన సనాతన సాంప్రదాయాలు కనుమరుగు అవుతున్నాయి. ఈ నేపధ్యంలో మనం మర్చిపోతున్న గొబ్బెమ్మల పాటను మీకు గుర్తు చేసే ప్రయత్నంలో భాగంగా గొబ్బిపాటలను భక్తిసారం ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాం.
చల్లాలమ్మే గొల్లాభామా పిల్లల్లారా రారండోయ్
తల్లుల్లారా రారండోయ్
చల్లోయమ్మ చల్లా
చల్లాలమ్మే గొల్లాభామా పిల్లల్లారా రారండోయ్
తల్లుల్లారా రారండోయ్
చల్లోయమ్మ చల్లా
ఏ ఊరి దానవె గొల్లభామా
ఏ ఊరి దానవె గొల్లభామా
నీవు ఎక్కడికి పోయెదవె గొల్లభామా
నీవు ఎక్కడికి పోయెదవె గొల్లభామా
రేపల్లె మాఊరు అందగాడా
రేపల్లె మాఊరు అందగాడా
నేను చల్లలమ్మ బోయెదను వన్నెకాడా
నేను చల్లలమ్మ బోయెదను వన్నెకాడా
చల్లాలమ్మే గొల్లాభామా పిల్లల్లారా రారండోయ్
తల్లుల్లారా రారండోయ్
చల్లోయమ్మ చల్లా
అయితే సంతలో
బేరాలు చేయగలవా గొల్లభామా
నీవు లాభాలు తీయగలవా గొల్ల భామ
నీవు లాభాలు తీయగలవా గొల్ల భామ
బేరాలు చేయగలను అందగాడా
బేరాలు చేయగలను అందగాడా
నేను లాభాలు తీయగలను అందగాడా
నేను లాభాలు తీయగలను అందగాడా
చల్లాలమ్మే గొల్లాభామా
పిల్లల్లారా రారండోయ్
తల్లుల్లారా రారండోయ్
చల్లోయమ్మ చల్లా చల్లోయమ్మ చల్లా
వగలాడి దానవె గొల్లభామా నీకు నగలేమి లేవేమె గొల్లభామా
నీకు నగలేమి లేవేమె గొల్లభామా
నగలు గిగలు నాకేల అందగాడా నగలు గిగలు నాకేల అందగాడా
నాకు నామోమె నా సొగసు వన్నెకాడా
నాకు నామోమె నా సొగసు అందగాడా
అటులైతె వినుమోలె గొల్లభామ
అటులైతె వినుమోలె గొల్లభామ
నేను నిన్ను పెళ్ళి చేసుకోనె గొల్లభామా
నేను నిన్ను పెళ్ళి చేసుకోనె గొల్లభామా
నిన్నెవరు అడిగారు అందగాడా
నీ దారి నువ్వు పోవోయి కొంటెవాడా
నీ దారి నువ్వు పోవోయి కొంటెవాడా
చల్లాలమ్మే గొల్లాభామా
పిల్లల్లారా రారండోయ్
తల్లుల్లారా రారండోయ్
చల్లోయమ్మ చల్లా చల్లోయమ్మ
చల్లా చల్లోయమ్మ చల్లా