సెప్టెంబరు 23 నుండి అక్టోబరు 1వ తారీఖు వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాలు


ఈ ఏడాది సెప్టెంబరు 23 నుండి అక్టోబరు 1వ తారీఖు వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాలు నిర్వహించేందుకు టిటిడి సమాయత్తం అవుతోంది. ఇందులోభాగంగా సెప్టెంబరు 23న ధ్వజారోహణం, సెప్టెంబరు 27న గరుడోత్సవం, సెప్టెంబరు 28న స్వర్ణరథం, సెప్టెంబరు 30న రథోత్సవం, అక్టోబరు 1న చక్రస్నానం, ధ్వజావరోహణం జరుగనున్నాయి. ఈ విశేష ఉత్సవాలను తిలకించేందుకు విచ్చేసే భక్తకోటికి టిటిడి విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతోంది.

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవేంకటేశ్వరస్వామి వెలసియున్న తిరుమల దివ్యక్షేత్రంలో ప్రతి ఏటా బ్రహ్మూెత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. నిత్యకల్యాణచక్రవర్తికి ఏటా నిర్వహించే 450 ఉత్సవాల్లో సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మ నిర్వహించిన ఉత్సవాలుగా బ్రహ్మూెత్సవాలు ప్రసిద్ధికెక్కాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత భారీ ఎత్తున నిర్వహించే ఉత్సవాలివి.


బ్రహ్మూెత్సవాల కోసం ఆయా విభాగాలు ఇప్పటికే ఏర్పాట్లను ప్రారంభించాయి. శ్రీవారి పుష్కరిణి మరమ్మతు పనులు ఆగస్టు 1న ప్రారంభించిన విషయం విదితమే. ప్రణాళికాబద్ధంగా ఈ పనులు జరుగుతున్నాయి. ఎలక్ట్రికల్‌ విభాగం ఆధ్వర్యంలో ఇప్పటినుంచే విద్యుత్‌ అలంకరణల కోసం ప్రాథమిక పనులు చేపట్టారు. 

ఉద్యానవన విభాగంలో ఆధ్వర్యంలో ఈసారి మరింత ఆకర్షణీయంగా ఫలపుష్ప ప్రదర్శన, ఇతర పుష్పాలంకరణ చేపట్టనున్నారు. ఇందుకోసం ఫలపుష్ప ప్రదర్శనలో ఏర్పాటుచేసే వివిధ సెట్టింగులకు సంబంధించి పౌరాణిక అంశాలను ఖరారు చేస్తున్నారు. బ్రహ్మూెత్సవాల నేపథ్యంలో భక్తులకు టిటిడి పలు సూచనలు చేస్తోంది.
  • బ్రహ్మూెత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ ద ష్ట్యా తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జితసేవలు రద్దు.
  • గదుల ముందస్తు బుకింగ్‌ను రద్దు.
  • వయోవ ద్ధులు, వికలాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు ఇత్యాది ప్రత్యేక దర్శనాలు రద్దు.
  • బ్రహ్మూెత్సవాల తొమ్మిది రోజుల పాటు అంగప్రదక్షిణ టోకెన్ల రద్దు.
  • ఉదయం, రాత్రి వాహనసేవల సమయాల్లో భక్తులు స్వామివారిని దర్శించుకోవడం మూలవిరాట్టు దర్శనంతో సమానమని పురాణభాష్యం.
  • వాహనాలపై స్వామివారిని ఊరేగించే సమయాల్లో భక్తులు దయచేసి నాణేలు విసరవద్దని మనవి.
  • తిరుమాడ వీధుల్లో భక్తులు పాదరక్షలతో నడవరాదని వినతి.
  • భక్తుల అవసరాలను ద ష్టిలో ఉంచుకుని తగినన్ని అదనపు లడ్డూలను నిల్వ ఉంచేందుకు చర్యలు.
Source