ముగిసిన శ్రీ సుందరరాజస్వామివారి అవతార మహోత్సవాలు


తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన అవతార మహోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. చివరిరోజు రాత్రి శ్రీ సుందరరాజస్వామివారు గరుడ వాహనంపై భక్తులను అనుగ్రహించారు.
ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2 నుంచి 3.30 గంటల వరకు శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో శ్రీసుందరరాజస్వామివారికి వేడుకగా అభిషేకం చేపట్టారు. 

సాయంత్రం 5.30 నుంచి 6.15 గంటల వరకు ఊంజల్‌ సేవ నిర్వహించారు. రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు విశేషమైన గరుడ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ ఉత్సవం కారణంగా శ్రీపద్మావతి అమ్మవారి సహస్రదీపాలంకరణ సేవ రద్దయింది.